మకరం ( డిసెంబర్ 22 - జనవరి 19)
వీరు గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం.
ప్రతి పనిలోనూ విజయం సా«ధించేందుకు తగిన కృషి చేస్తారు.
బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు.
ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు.
సోదరీ,సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు.
కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ల వారు లక్ష్యసాధన దిశగా కదులుతారు.
వివాహాది శుభకార్యాల నిర్వహణపై ఒక అంచనాకు వస్తారు.
విద్యార్థులు కోరుకున్న ర్యాంకులు, ఫలితాలు సాధిస్తారు.
ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడాలి, ఆహార విహారాదులలో తగు జాగ్రత్తలు పాటించడం మంచిది.
దైవకార్యాలలో నిమగ్నమవుతారు.
వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభాలు పెరుగుతాయి.
ఉద్యోగులు తమ విధులు చక్కదిద్దడంలో ఆటంకాలు అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పట్టింది బంగారమే అనే విధంగా ఉంటుంది..
కళాకారులు, రాజకీయవేత్తలకు సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి.
ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలలు కొంత చికాకు పరుస్తాయి.
ఇంటాబయటా కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి.
అదృష్ట సంఖ్య–8