కన్య
మీ కష్టం అంతగా ఫలించకపోవడంతో డీలాపడతారు.
మీ సహాయం పొందిన వారే వెనుకడుగు వేస్తారు.
డబ్బు సమకూరక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.
నేర్పుగా కొన్ని వ్యవహారాలను నెట్టుకొస్తారు.
ఆత్మీయులు, బంధువర్గం నుంచి ఆశించిన సహాయం అంతగా అందదు.
ముఖ్య నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు.
వివాహాది వేడుకలలో కొన్ని ఇబ్బందులు.
ఉద్యోగార్ధులు శ్రమపడితే ఫలితం కనిపిస్తుంది.
కాంట్రాక్టులు తృటిలో తప్పిపోవచ్చు.
వాహనాల విషయంలోనూ నిర్లక్ష్యం వద్దు.
ఆరోగ్యం మందగించి వైద్యసేవలు పొందాల్సి వస్తుంది.
ఆర్థిక హామీలపై ఆచితూచి వ్యవహరించడం మంచిది.
తీర్థ యాత్రలు చేస్తారు.
వృత్తులు, వ్యాపారాలలోని వారు మరింత ఆచితూచి వ్యవహరించాలి.
వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు ఎట్టకేలకు అవకాశాలు దక్కించుకుంటారు.
15,16 తేదీల్లో వద్దంటే డబ్బు అన్నట్లు ఉంటుంది.
కొన్ని సమస్యల వలయం నుంచి బయటపడతారు.
వాహనాలు, స్థలాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.