మీనం
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే సిద్ధిస్తుంది.
బంధువులు మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకోవడం సంతోషం కలిగిస్తుంది.
చాకచక్యంతో సమస్యలను అధిగమిస్తారు.
గతం నెమరువేసుకుంటూ భవిష్యత్తుపై ఆశలతో ముందడుగు వేస్తారు.
ఇంట్లో శుభకార్యాలు నిర్వహణలో నిమగ్నమవుతారు.
మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు మెచ్చుకుంటారు.
ఆశించినంతగా ఆదాయం సమకూరి మరింత ఉత్సాహంగా గడుపుతారు.
సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు.
మిత్రులు, ఆప్తులు మీ పై ప్రశంసల జల్లు కురిపిస్తారు.
విద్యార్థులు, ఉద్యోగార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం.
వాహనాలు, స్థలాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.
దైవకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.
ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.
గతానుభవాలను నెమరువేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తారు.
పలుకుబడి, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
మీ ప్రమేయం లేకుండానే కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు.
వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు వైపు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, కళాకారులకు మరింత ఖ్యాతి దక్కుతుంది.
ఒత్తిడులు. మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు బాధిస్తాయి