తుల
ఇతరుల సాయం పొందకుండానే కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు.
రాబడికి ఇబ్బందిపడిన మీరు ఈవారం మెరుగైన ఫలితాలు చూస్తారు.
చర,స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కొన్ని సంఘటనలు జీవితానుభవాన్ని నేర్పుతాయి.
ప్రముఖుల పరిచయాలు పెరిగి వారి ద్వారా చేయూత అందుకుంటారు.
మీరు తీసుకునే నిర్ణయాలు పదిమందికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి.
శుభకార్యాలు నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు.
దైవకార్యక్రమాలలో భాగస్వాములవుతారు.
క్రీడారంగం పై మరింత దృష్టి సారిస్తారు. నైపుణ్యతను చాటుకుని గుర్తింపు పొందుతారు.
వృత్తి, వ్యాపారాలలో అడ్డంకులు తొలగి ముందుకు సాగుతారు.
కళాకారులు, సాంకేతికవర్గాలకు ఊహించని రీతిలో అవకాశాలు దక్కవచ్చు.
మహిళల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతుంది.
24,25 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.