మిథునం
విశేష యోగదాయకమనే చెప్పాలి.
మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.
కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలే అమలు కాగలవు.
సోదరులు, స్నేహితుల సహాయం సైతం అందుకుంటారు.
అవసరాలకు సొమ్ము సమకూరడం విశేషం.
సుఖసంతోషాలతో గడుపుతారు.
మీ పట్ల వ్యతిరేకులు తమ పంథాను మార్చుకుంటారు.
ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
కాంట్రాక్టర్లకు అవకాశాలు విస్తృతమవుతాయి.
ఆధ్యాత్మికత వైపు సాగుతారు.
స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.
భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.
వృత్తులు, వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి.
కళాకారులు, క్రీడాకారులు మరింత గుర్తింపు పొందుతారు.
16,17 తేదీలలో వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు.