కర్కాటకం
చీటికీ మాటికీ అయిన వారితో కలహాలు వివాదాలు నెలకొని పరీక్షగా మారవచ్చు.
అన్ని విషయాలలోనూ మౌనం పాటించడం ఉత్తమం.
ఆదాయవ్యయాలు సమతూకంగా ఉంటాయి.
చేపట్టిన కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగండి.
విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రతిభ చూపినా ఆశించిన ఫలితం కనిపించక డీలా పడతారు.
మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయి.
ప్రత్యర్థుల కదలికలను, చర్యలను గమనిస్తూ ఉండడం మంచిది.
ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వీడండి.
కష్టసాధ్యమైన కొన్ని వ్యవహారాలలో తలదూర్చి ఇబ్బంది పడతారు.
మధ్యమధ్యలో కొంత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది.
ఇళ్ల నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలలో అవాంతరాలు ఉంటాయి..
వృత్తులు, వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది.
ఉద్యోగస్తులు విధి నిర్వహణలో బాధ్యతగా మెలగాలి.
ఉన్నతాధికారులతో మాటపడాల్సి వస్తుంది.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు కొంత పరీక్షా సమయంగా ఉంటుంది.